
ఆశ.
గుండె గొంతు మూగబోయి
గుండె సవ్వడి ఆగిపోయే వరకు
గువ్వ పిల్లలా నీ గుండె గూటిలో
గుడి కట్టుకుని గుసగుసలాడలనీ..
చిరునవ్వు చిరునామా చెదిరి పోయి
సిరిమువ్వల సరిగమలు నిశబ్ధమై పోయేవరకు
చిరుసవ్వడి చేసే నీ ఎదఝరిలో
చిగురాకుల గలగలనై కలిసిపోవాలనీ....
ఊపిరి ఊరు పేరు మారిపోయి
ఉఛ్వాస నిశ్వాసముల ప్రాణం పోయేవరకు
ఊపిరికే ప్రాణం పోసే నీ ఊపిరిలో
ప్రాణవాయువై కలిసి నీ ఎదలో నిండిపోవాలనీ...
..............................నరసింహ రెడ్డి తగిరంచ
No comments:
Post a Comment