
శిక్షణ
బడి పోరలను బరిగే వట్టి కొట్టుడు తప్పు !
బువ్వ వెట్టె కాడ వెడితే
బుగులు జెప్పుడు తప్పు.. !
బోధించేటపుడు
బాధించినా...
బెదిరిచ్చుడు తప్పు..!!
బరిగె వట్టక
బుగులు వెట్టక
బుధ్ధి చెప్పుడు ఒప్పు..!
బతుకు భారం మోస్తూ
బజార్ల పోరడు కనబడ్డా తప్పు..!
బడిబాట వదిలి
పనిబాట వడితే మరింత తప్పు..!!
"బుక్కు ఒక్కటే
బువ్వ వెట్టదీ...
బతకడానికి
పని కూడా నేర్వాలన్న
పోరడే ఒప్పు..!?
" ఆర్ టి ఈ లు ఆక్ట్ లు
వందలు వేలచ్చినా..
తప్పేదో.. ఒప్పేదో
తప్పక వదిలిపెట్టి
బడి పంతుల్లు గా
బాధ్యత వహించి
భావి పౌరుల
భవిష్యత్ నిర్దేశనలో
బాగుపడే దిశగా
బంగారు బాటలు చూపుదాం...
న్యాయ, సమసమాజ
నిర్మాణానికి
నాంది పలుకుతూ
నీతిగల్ల పునాదులేద్దాం...
....................................తగిరంచ నర్సింహ రెడ్డి
.. ( తాడ్వాయి లో జరిగిన ఉపాధ్యాయ శిక్షణ జూన్ 2011 లో )
No comments:
Post a Comment