
- భాగ్యరేఖలు.
రవి కిరణముల నీ కనుచూపులు
కవి కలములకు ప్రాణ దీపాలు
భువి లోగిలిలోనే స్వర్గలోకాలు
ఎద సడులలో ప్రణయగీతాలు
మది మందిరంలో దైవ స్వరూపాలు
రవి కిరణముల నీ కనుచూపులు
రసరమ్య గోదావరి అలలు
రాగ రంజిత మంజీర నాదాలు
రవళించే హృదిలో అమృత కలశాలు
రమణీయ ప్రకృతిలో సుందర దృశ్యాలు
శశి కిరణముల నీ కను చూపులు
ఎదపై సంధించిన మన్మధ బాణాలు
మది లో నిలిపిన మహత్తర కావ్యాలు
సరస గీతాల ప్రేమ జలపాతాలు
సాంతం నీకంకితమైన నా పంచప్రాణాలు...
శశి కిరణముల నీ కను చూపులు
శతకోటి భావాల శరత్ చంద్రికలు
శతాయుస్సునిచ్చే సుధామధురిమలు
నిశీధిని నిలువునా చీల్చే కాంతిధారలు
పసి మనస్సై కరుణించే పద్మసుమాలు
బానిసలా నీ చెంత చేర్చిన నా భాగ్యరేఖలు... .
.......నర్సింహ రెడ్డి తగిరంచ
No comments:
Post a Comment