Tuesday, March 14, 2017

holi -హోళీ cps అంతం -మన పంతం

*రంగవల్లుల(OPS) జీవితానికి పునాది*

ఉద్యోగ ప్రపంచంలో
సప్తవర్ణశోభితమౌ
పాతఫించన్ విధానాన్కి
నూతనపద్దతను
నలుపురంగునద్ది
భవిష్యత్తంతా చీకటి చేస్తిరి!
*నౌకరున్నోని బతుకున*
*కౌసుగుడ్లని కొట్టి*
గిదే పండుగనడమెంత నీచం !
త్యాగాలకు చిహ్నాలైన
మోదుగ(గోగు) పూలను
రంగరించి మెరిపించి
ముద్దుముద్దు గీతాలతో
ఊరంతా తిరుగుతూ
ఆటాలాడేదే హోళీ పండుగ !
*CPS అనే కలుషితవిషపురంగును*
*కండ్లల్ల కొట్టి భవితకు*
*చూపులేకుంటజేసుడెట్ల న్యాయం !!*

అరే ముచ్చటపడుకుంట
సాయంత్రాలు కోలలుకొట్టి
అడేల్ తుడేల్ జింకపిల్ల అని
రాగాలు తీస్కుంట యింటింటికి పోయేది!
పున్నమిపూట పిడకలుపేర్చి
కామున్ని కాలపెట్టి పండగజేసేది!
గిప్పుడు జింకపిల్ల పాటలు కాదు
రాగాలు తీసుడసలే కాదు
సింహాలై గర్జించుడు కొనసాగుతుంది!
*కామునికి బదులుగ CPSను*
*కాలవెట్టుడు శురువైంది!!*
అమ్మలక్కలంత సర్కారు గుమ్మంముందు
పాతపించనొక్కటే ప్రాణాలు నిలవెడుతదని
రామసక్కని పాటలు పాడుతున్నరు!
డప్పులు మోతతోటి అన్నలందరుకూడిన్రు!
CPSకు
చావుడప్పుకొడుతున్నరు!!
OPSయివ్వనంటే గదే డప్పు
సర్కారు గుమ్మంల కొడుతమని సిద్దమైండ్రు!!
పాతపింఛనిస్తెనే సర్కారుకు
పండుగ డప్పు మోత!
రామసక్కనిపాటల ఊట!!
*పాత పెన్షన్ విధానం వచ్చేదాక*
*గిట్లాంటి పండుగలే జరుగుతయి!!*
   మిత్రులందరికి హోళీ శుభాకాంక్షలతో ..
.          
                    .....తగిరంచ నర్సింహారెడ్డి