హృదయాన్నొక కాగితంగ చుట్టేస్తూ కానుకగా ఇవ్వనా?
ప్రేమాక్షరి దానిపైన రాసేస్తూ కానుకగా ఇవ్వనా?!
నవ్వులన్ని పోగు చేసి జాబిల్లిని ముద్దులలో ముంచావె
వెన్నెలింట మమతమదిని పరిచేస్తూ కానుకగా ఇవ్వనా?!
ప్రాణానికి ప్రతిరూపం నీ ఎదసడి బాసలలో విన్నానె!
మనప్రేమగ నా ఊపిరి జతచేస్తూ.. కానుకగా ఇవ్వనా ?!
మనసంతా మరుమల్లెల పరిమళాలు మాటలుగా చల్లితివి!
నీ పలుకులు కావ్యంగా మలిచేస్తూ కానుకగా ఇవ్వనా ?!
అసలుసిసలు ప్రేమకొరకు దునియాలో వెతకడమే మానేసా!
నీ కన్నుల తాజుమహలు కట్టేస్తూ కానుకగా ఇవ్వనా ?!
No comments:
Post a Comment