Wednesday, January 27, 2021

రుబాయీలు

             ***** 
కుర్చీ కూసాలు పుచ్చిపోతున్నయ్ 
ఎపుడో ఆ కాళ్లు విరిగిపోనున్నయ్ 
జెర పయిలం! కుప్పకూలుడు ఖాయమే !! 
మీ మెదళ్లు కుళ్లి మురిగిపోతున్నయ్ 
              ****** 
పదనలేదనుకోకు గమనించుకో..! 
అహంకారబుద్ధిని వదిలించుకో .. 
సాపకింద నీరు పారుతూ ఉంది ! 
సునామై ముంచుతది గుర్తుంచుకో!!  
               ***** 
అధికారదాహం రక్తాన్ని తాగుతూనె ఉంది 
కుర్చీపై మోజు బ్రతుకులని మింగుతూనె ఉంది 
మనిషికైన,మాటకైన స్వేచ్ఛ ఎక్కడుందసలు!?
మత్తేదొ, ప్రజాస్వామ్య పీకను కోస్తూనె ఉంది 
                      ***** 
కూస్తూనే ఉన్నరు కారుకూతలేవో పిచ్చిపట్టినట్లుగా ! 
చేస్తూనే ఉన్నరు వెకిలిచేష్టలేవో మెదడు దొబ్బినట్లుగా !
మనిషి ఎదగడమంటే మరొకడిని పాతాళానికి తొక్కుడు కాదు!
మోస్తూనే ఉన్నరు మీ పాడెలను మీరే మతి చెదిరినట్లుగా! 
                     ***** 

No comments:

Post a Comment