నువ్వే నా గుండె నిండుగా..

ఊపిరితో నా గుండె అంతా నువ్వై ఉండగా..
నా చెంత నుండి నువ్వు కవ్విస్తుండగా..
ఇంకా.. వేరే ఊహలు ఎందుకు..?
నీ ఊసులే నను పులకరింపజేస్తుండగా...
ఇంకా.. ఆ తొలకరి జల్లుల స్పర్శలేందుకు..?
ప్రేమ దేవతవై నువ్వు కరుణిస్తుండగా..
ఇంకా.. ఆ దేవి కటాక్షమెందుకు..?
ప్రేమ లోకంలో వన విహారం చేస్తుండగా..
ఇక ఆ స్వర్గలోక సౌఖ్యాలేందుకు..?

ఊపిరితో నా గుండె అంతా నువ్వై ఉండగా..
ఇంకా ఈ గుండెల్లో గుడి ఎందుకు..?
నా చెంత నుండి నువ్వు కవ్విస్తుండగా..
ఇంకా.. వేరే ఊహలు ఎందుకు..?
నీ ఊసులే నను పులకరింపజేస్తుండగా...
ఇంకా.. ఆ తొలకరి జల్లుల స్పర్శలేందుకు..?
ప్రేమ దేవతవై నువ్వు కరుణిస్తుండగా..
ఇంకా.. ఆ దేవి కటాక్షమెందుకు..?
ప్రేమ లోకంలో వన విహారం చేస్తుండగా..
ఇక ఆ స్వర్గలోక సౌఖ్యాలేందుకు..?
. . తగిరంచ నర్సింహ రెడ్డి
ఫరీద్ పేట్..
ఫరీద్ పేట్..