Tuesday, October 18, 2011

రాంగా .. రైటా ..? !

రాంగా .. రైటా ..? !

నువ్ నిజంగా -
నిజంగా ఉద్యమకారుడివైతే..
సమాజహితం కోరే
సదుద్దేశ్య నాయకుడివైతే...
అన్నార్తుల ఆర్తనాదాలు విని
ఆకలి తీర్చే పోరుబాటలో వీరుడివైతే..
నువ్ నిజంగా-
నిజంగా మానవత్వమున్న
మామూలు మనిషివైనా ఐతే..
నువ్ చేసింది రాంగా .. ?రైటా ..? !


నీ ఒంట్లో జ్వలిస్తున్న
ఎర్రటి నెత్తుటి ముద్దకు తెలుసు..!
నరనరాన పౌరుషాగ్నితో
ప్రవహించే నెత్తురుకు తెలుసు..!
నిన్ను నిలువెల్లా కదిలిస్తున్న
నీ కీళ్ళ సప్పుడుకు తెలుసు..!
నిన్నీ స్థాయికి చేర్చిన
అణువణువుకు ....
నీ అంతరంగానికి తెలుసు..!
నువ్ చేసిందీ రైటో..? రాంగో..?
నీ అంతరాత్మకు
అంతకన్నా బాగా తెలుసు..
నువ్ చేసిందీ రైటో..? రాంగో..?

పుణ్య కార్యం కోసం జర్గుతున్న
పవిత్ర యజ్ఞంలో ఉవ్వెత్తున్న
ప్రజ్వరిల్లే అగ్నిశిఖలను ...
మేఘ ( మనీ ) మథనం జరిపి
మామూలూ మంటల్లా
సల్లార్పుటా .. సల్లర్పాల్నుకోను ...
రాంగా .. ?రైటా ..? !
నువ్ చేసింది రాంగా .. ?రైటా ..? !

డబ్బాలు గీసుకుని
కండ్లు మూసుకుని
రాంగా .. ?రైటా ..? !
అంటూ ఆడిన ఆట
యాదికున్నదా..?
గీత తొక్కితే రాంగే..
రాంగంటే ఔటన్నట్లే..
ఔటంటే
ఆటలకేంచి అవతలికన్నట్లే..

ఆలోచించుకో...
నువ్ చేసింది రాంగా .. ?రైటా ..? !



నరసింహా రెడ్డి తగిరంచ














No comments:

Post a Comment