ప: సూదంటు రాయి సూపులున్న
సుగుణాల బాల యాడికే..
నా మందారమాల యాడికే....
మనసంత దోచేటి నవ్వులున్న
నగుమోముదానా యాడికే..
నాఎదలోని దేవి యాడికే....
సుగుణాల బాల యాడికే..
నా మందారమాల యాడికే....
మనసంత దోచేటి నవ్వులున్న
నగుమోముదానా యాడికే..
నాఎదలోని దేవి యాడికే....
చ : ఒక్కసారన్న నువ్ చూస్తావని
ఒక్క తీరుగ నీ యెనకే తిరిగా..
పక్కకెంచినువ్ పోతావుంటే
ప్రాణమంత నాదాగమాయే
ఓ పగడాలపిల్లా యాడికే...
నా పరువాల కొమ్మ యాడికే...
ఒక్క తీరుగ నీ యెనకే తిరిగా..
పక్కకెంచినువ్ పోతావుంటే
ప్రాణమంత నాదాగమాయే
ఓ పగడాలపిల్లా యాడికే...
నా పరువాల కొమ్మ యాడికే...
చ : నువ్వెల్లెటి తొవ్వల్ల యెన్నేల వెలుగులు
నడిచేటి బాటల్ల నాజూకు తీగెలు
పలికేటి మాటల్ల బంగారు తూటాలు
గుచ్చి చేసే నా గుండెల్లో గాయాలు....
ఓ పున్నమీ యెన్నీల యాడికే..
నా యెండి కొండ జెర చూడవే.....
నడిచేటి బాటల్ల నాజూకు తీగెలు
పలికేటి మాటల్ల బంగారు తూటాలు
గుచ్చి చేసే నా గుండెల్లో గాయాలు....
ఓ పున్నమీ యెన్నీల యాడికే..
నా యెండి కొండ జెర చూడవే.....
చ :సిరి సిరి మువ్వల సంగీతమూ నువ్వు
సెలయేటి గలగలల సాహిత్యము నువ్వు...
విరిసేటి హరివిల్లు అమ్మువు నువ్వై
సంధించి నా గుండె బంధించినావే ...
ఓ ముత్యాల ధార యాడికే..
నా మురిపాల కొమ్మ యాడికే....
.............. నర్సింహ రెడ్డి తగిరంచ
సెలయేటి గలగలల సాహిత్యము నువ్వు...
విరిసేటి హరివిల్లు అమ్మువు నువ్వై
సంధించి నా గుండె బంధించినావే ...
ఓ ముత్యాల ధార యాడికే..
నా మురిపాల కొమ్మ యాడికే....
.............. నర్సింహ రెడ్డి తగిరంచ
No comments:
Post a Comment