Thursday, November 24, 2011

శిక్షణ


శిక్షణ
బడి పోరలను
బరిగే
వట్టి కొట్టుడు తప్పు !
బువ్వ
వెట్టె కాడ వెడితే
బుగులు జెప్పుడు తప్పు.. !
బోధించేటపుడు

బాధించినా...

బెదిరిచ్చుడు తప్పు..!!


బరిగె వట్టక

బుగులు వెట్టక

బుధ్ధి చెప్పుడు ఒప్పు..!

బతుకు భారం మోస్తూ
బజార్ల పోరడు కనబడ్డా తప్పు..!
బడిబాట వదిలి
పనిబాట వడితే మరింత తప్పు..!!
"బుక్కు ఒక్కటే
బువ్వ వెట్టదీ...
బతకడానికి
పని కూడా నేర్వాలన్న
పోరడే ఒప్పు..!?

"
ఆర్ టి ఈ లు ఆక్ట్ లు
వందలు వేలచ్చినా..

తప్పేదో.. ఒప్పేదో

తప్పక వదిలిపెట్టి

బడి పంతుల్లు గా

బాధ్యత వహించి

భావి పౌరుల

భవిష్యత్ నిర్దేశనలో

బాగుపడే దిశగా

బంగారు బాటలు చూపుదాం...

న్యాయ, సమసమాజ

నిర్మాణానికి

నాంది పలుకుతూ

నీతిగల్ల పునాదులేద్దాం...

....................................తగిరంచ నర్సింహ రెడ్డి
.. ( తాడ్వాయి లో జరిగిన ఉపాధ్యాయ శిక్షణ జూన్ 2011 లో )

Saturday, November 12, 2011


ఆశ.



గుండె
గొంతు మూగబోయి
గుండె సవ్వడి ఆగిపోయే వరకు
గువ్వ పిల్లలా నీ గుండె గూటిలో
గుడి
కట్టుకుని గుసగుసలాడలనీ..



చిరునవ్వు
చిరునామా చెదిరి పోయి
సిరిమువ్వల
సరిగమలు నిశబ్ధమై పోయేవరకు
చిరుసవ్వడి చేసే నీ ఎదఝరిలో

చిగురాకుల గలగలనై కలిసిపోవాలనీ....


ఊపిరి ఊరు పేరు మారిపోయి

ఉఛ్వాస నిశ్వాసముల ప్రాణం పోయేవరకు

ఊపిరికే ప్రాణం పోసే నీ ఊపిరిలో

ప్రాణవాయువై కలిసి నీ ఎదలో నిండిపోవాలనీ...


..............................నరసింహ రెడ్డి తగిరంచ

Friday, November 4, 2011

భాగ్యరేఖలు...






  • భాగ్యరేఖలు.




రవి కిరణముల నీ కనుచూపులు
కవి కలములకు ప్రాణ దీపాలు
భువి లోగిలిలోనే స్వర్గలోకాలు

ఎద సడులలో ప్రణయగీతాలు

మది మందిరంలో దైవ స్వరూపాలు

రవి కిరణముల నీ కనుచూపులు

రసరమ్య గోదావరి అలలు

రాగ రంజిత మంజీర నాదాలు
రవళించే
హృదిలో అమృత కలశాలు

రమణీయ
ప్రకృతిలో సుందర దృశ్యాలు


శశి
కిరణముల నీ కను చూపులు
ఎదపై
సంధించిన మన్మధ బాణాలు
మది
లో నిలిపిన మహత్తర కావ్యాలు
సరస గీతాల ప్రేమ జలపాతాలు
సాంతం నీకంకితమైన నా పంచప్రాణాలు...

శశి కిరణముల నీ కను చూపులు
శతకోటి
భావాల శరత్ చంద్రికలు
శతాయుస్సునిచ్చే
సుధామధురిమలు
నిశీధిని
నిలువునా చీల్చే కాంతిధారలు
పసి
మనస్సై కరుణించే పద్మసుమాలు
బానిసలా నీ చెంత చేర్చిన నా భాగ్యరేఖలు... .


.......నర్సింహ రెడ్డి తగిరంచ