తేటగీతి
లెక్కలేనన్ని మురిపాలు లీలగాను
ప్రేమ తలపుల పిలుపులే ప్రియముగాను
నీదు నవ్వులే వరములై నేస్తమయ్యె
కోట్ల విలువరా ! నీ తోడు కోలుపోను !
అందమైన బుగ్గన నేను బిందువైతె
అంతకన్న భాగ్యమ్మేది యనవసరము.
పిచ్చి పిచ్చిగా ప్రేమనే పంచు చూపు
తోడు నీడగున్నయు చాలు తుదవరకును
ఆటవెలది
వేలి గోటిపైన వెన్నెల వర్ణమై
మెరుపులద్దుతాను మురిసిపోవ
కాలియందెల సడి కమనీయ రాగమై
కలిసిపోదునీలొ కావ్య కన్య
గుండె సడిని వినెడి గొలుసునై చేరితే
పండగౌను నాకు ప్రాణమౌను !
గుండెగుడిని జేరి గుసగుసలాడితే
దిగులు దీరి మనసు దివ్యమౌను!!
లెక్కలేనన్ని మురిపాలు లీలగాను
ప్రేమ తలపుల పిలుపులే ప్రియముగాను
నీదు నవ్వులే వరములై నేస్తమయ్యె
కోట్ల విలువరా ! నీ తోడు కోలుపోను !
అందమైన బుగ్గన నేను బిందువైతె
అంతకన్న భాగ్యమ్మేది యనవసరము.
పిచ్చి పిచ్చిగా ప్రేమనే పంచు చూపు
తోడు నీడగున్నయు చాలు తుదవరకును
ఆటవెలది
వేలి గోటిపైన వెన్నెల వర్ణమై
మెరుపులద్దుతాను మురిసిపోవ
కాలియందెల సడి కమనీయ రాగమై
కలిసిపోదునీలొ కావ్య కన్య
గుండె సడిని వినెడి గొలుసునై చేరితే
పండగౌను నాకు ప్రాణమౌను !
గుండెగుడిని జేరి గుసగుసలాడితే
దిగులు దీరి మనసు దివ్యమౌను!!
No comments:
Post a Comment